
- హాస్య రచనలతో సుప్రసిద్ధులుగా..
- బాపు, రమణలది ఆరు పదుల చెలిమి బంధం
- చివరి సినిమా శ్రీరామరాజ్యం
- ఆంధ్రపత్రికలో సబ్ ఎడిటర్‌గా చేసి...
- బుడుగు రచనతో పేరుతెచ్చుకొని...
-ముత్యాలముగ్గు, పెళ్లిపుస్తకం, మిస్టర్ పెళ్లాం వంటి హిట్ సినిమాలు
- తెలుగు సినిమాలో విలనిజానికి కొత్త రూపం
- గిలిగింతలు పెట్టే డెైలాగులకు పెట్టింది పేరు
- మాటల మాంత్రికుడు
- ఆయన మరణం తెలుగు సాహిత్యానికి తీరని లోటు

ముళ్లపూడి వారి బుడుగు

ఇలా ఆరుద్ర చెప్పినట్లుగా ముళ్ళపూడి వెంకటరమణ బుడుగు వెంకట రమణగా అయ్యారంటే ముళ్ళపూడి సృష్టించిన పాత్రలన్నింటిలోనూ బుడు గు ఎంత ప్రసిద్ధమయ్యాడో తెలుస్తుంది. నవంబరు 1956 నుండి ఏప్రిల్ 1957 వరకు ఆంధ్రపత్రిక వార పత్రికలో సీరియల్‌గా వచ్చింది. అప్పుడు రచయిత అసలు తన పేరు వేసుకోలేదు. చివరికి అందరి బలవంతం వల్ల ఇది వ్రాసి పెట్టినవాడు - ఫలానా, బొమ్మలు వేసిపెట్టినవాడు - ఫలానా అని ఆఖరు సంచికలో వేశారు. అప్పుడు వీక్లీ సీరియల్‌కు పెట్టిన పేరు బుడుగు - చిచ్చర పిడుగు 24.4.1957లో బుడుగు స్కూల్లో చేరడానికి, అల్లరి మానే యడానికి నిశ్చయించుకోవ డంతో సీరియల్ ఆగిపో యింది. నాలుగేళ్ళ తరు వాత ‘వురేయ్, మళ్ళీ నేనే’ అని పాఠకులను అలరిస్తూ వచ్చాడు. అప్పటికి కాస్త తెలివి మీరాడు. అణ్వస్త్ర భయం గురించి, మేష్టర్ల జీ తాల గురించి కూడా మా ట్లాడేవాడు బుడుగు.
బుడుగు పాత్ర సృష్టికి సు ప్రసిద్ధ ఆంగ్ల కార్టూన్ డెని స్ - ది మెనేస్ స్ఫూర్తి అని అంటుంటారు. ఇది ఎంత నిజమో తెలియదు కానీ ముళ్ళపూడి వెంకట రమ ణను చిన్నప్పుడు బుడుగు అని పిలిచేవారట.
1. డెనిస్, బుడుగు పాత్రలలో నూ, వారి పరిజనాలలోనూ సాహిత్యం ఉన్నదనుకొన్నా బుడుగు పరివారం, ఆలోచనలు, భాష అన్నీ పక్కా తెలుగు వాతావరణమే. ఆలోచించి చూస్తే డెనిస్ కంటె బుడుగు పాత్ర విస్తృతి ఎక్కువ (సమిష్టి కుటుంబం కారణంగా కావచ్చును).
బాపు బొమ్మలు: బుడుగు సృష్ట్టిలో బాపు పాత్ర చాలా ముఖ్యమైనది. పత్రిక లో వచ్చిన బుడుగు బొమ్మలే కాకుండా బుడుగు పుస్త్తకం ఒకో ప్రచురణలో ఒకోలాగా చిత్రిస్తూ కొత్తదనం మెయింటెయిన్ చేశారు. బాపు బొమ్మ వెబ్ సైటులో బుడుగు బొమ్మలు ప్రత్యేకంగా కనిపిస్తాయి.
బుడుగు పరిచయం: ఈ బొమ్మ నేను. నా పేరు బుడుగు. ఇంకో పేరు పిడుగు. ... ఇంకో అస్సలు పేరుంది. ఇప్పుడు చెప్పడానికి టైము లేదు. కావ లిస్తే మా నాన్నని అడుగు అని మొదట్లో బుడుగు తనను పరిచయం చేసు కుంటాడు...
బుడుగు కుటుంబంలో మనుషులు: నాన్న (గోపాళం), అమ్మ (రాధ) అమ్మా నాన్నా నిఝంగా కొట్టరు. కొట్టినా గట్టిగా కొట్టరు. ఉత్తుత్తినే.
బామ్మ : బుడుగును హారి పిడుగా అంటుంది. బుడుగును వెనకేసుకొస్తుంది. ఇక బాబాయి రెండుజళ్ళ సీత వస్తుంటే విజిలేయమంటాడు. వీడి దగ్గిర బోల్డు లౌలెట్రులున్నాయి.
బుడుగు ఇరుగు, పొరుగు ప్రవేటు మాష్టారు: వీడు మంచివాడు కాడు. అసలు ప్రవేటు మాష్టర్లు అందరూ ఇంతే. ఇప్పటికి వీడు పదోవాడు. ఒక్క డూ పకోడీలు తేడు. పెైగా లెక్కలు చేయమంటారు. చెవి మెలిపెడతారు.
రెండుజళ్ళ సీత : చాలామంది ఉన్నారు. ఒకోసారి ఒక జడ ముందుకీ, ఒక జడ వెనక్కీ వేసుకొని నడుస్తారు. ఇది చాలా ఇబ్బంది. అప్పుడు వాళ్ళు వస్తు న్నారో వెళ్తున్నారో ఎలా తెలుస్తుంది?
లావుపాటి పిన్నిగారు : అవిడకు పెద్ద జడ లేదు. అయినా పేరంటంలో పెద్ద జడ ఉంటుంది. అది నిజం జడ కాదనుకో. డేంజరు అంటే పిన్నిగారూ, మా బామ్మా పోట్లాడుకోవడం.
సీగాన పెసూనాంబ : బుడుగు గర్ల్‌ఫ్రెండ్
ఇంకా డికెష్టివ్, విగ్గు లేని యముడు, పిన్నిగారి మొగుడు, సుబ్బలక్ష్మి - ఇలా చాలా మందున్నారు.

* ప్రెవేటు చెప్పడం - లౌలెట్రు వ్రాసినపుడు రెండుజళ్ళ సీత నాన్న బాబాయికి ప్రెవేటు చెబుతాడు. ఒకోసారి నాన్న అమ్మకు ప్రెవేటు చెబుతాడు.* జాఠర్ ఢమాల్ - అంటే ఏంటో.* అంకెలు - ఒకటి, రెండు, ఫది, డెభ్బయ్యో, బోల్డన్నో* అనుభవం : టెంకిజెల్లలు, మొట ి్టకాయలు తినడం...బుడుగు భాష ప్రత్యేకమైనది. అది వ్యాకరణ పరిధికి అందదు. భాషలోని తియ్యదనం అంతా ఆ మాటల్లోనే ఉంది.
తన కాలంలోనే కాక తరువాత కాలం లో కూడా వస్తువరణంలో, భాష విష యంలో చేసిన ప్రయోగాలు ఇతర రచయి తలపెైన ప్రభావం కలిగించడమే కాక రెండు మూడు తరాల ప్రజల మనసులపెై ముళ్ళపూడి వెంకట రమణ చెరగని ముద్ర వేసుకున్నారు. తెలు గు సాహిత్యంలో ఆయన ప్రత్యేకమైన రచయితగా నిలి చిపోయారు. హాస్యరచనలలో ముళ్ళపూడి వెంకట రమణది ఫోర్జరీ చెయ్యలేని సంతకం, హాస్యరచనలో అనన్యం... అనితర సాధ్యం అతని మార్గం అని ఆంధ్ర పాఠక లోకం సగర్వంగా చెప్పుకునే మనసున్న మహాకవి ముళ్ళపూడి వెంకట రమణకి తెలుగు సాహితీలోకం యావత్తూ నివాళులర్పిస్తోంది. యాభెై సంవత్సరాలుగా బాపును అంటిపెట్టుకుని స్నేహమనే పదానికి సరికొత్త అర్థాన్ని ఇచ్చారు వారిరువురూ...బాపూరమణీయం అనే పదం ఎంత అందంగా ఇమిడిపోయిందో...బాపూరమణలు కూడా అంతకన్నా ఎక్కువగానే చెలిమిబంధంతో ్జకలిసిపోయారు. ఇకపెై బాపు ఒంటరిగానే నెగ్గుకు రావాలి...రమణీయత కోల్పోయిన బాపు పక్కన ఇంకెవ్వరినీ ఊహించలేము...బాలకృష్ణతో తీయబోయే ‘శ్రీరామరాజ్యం’ ఈ జంటకు చివరి సినిమా. ఆ సినిమా పూర్తికాకుండానే రమణగారు తుదిశ్వాస విడిచారు.
హాస్య నవలలు, కథలు...
బుడుగు - చిన్నపిల్లల భాష, మనస్తత్వం, అల్లరి గురించి హాస్య ప్రధానమైన బొమ్మలతో కూడిన రచన
ఋణానందలహరి (అప్పుల అప్పారావు- అప్పుల ప్రహసనం) విక్రమార్కుని మార్కు సింహాసనం - సినీ మాయాలోక చిత్ర విచిత్రం
గిరీశం లెక్చర్లు - సినిమాలపెై సెటైర్లు
రాజకీయ బేతాళ పంచవిశతి - రాజకీయ చదరంగం గురించి
ఇద్దరమ్మాయిలు ముగ్గురబ్బాయిల ప్రేమాయణం
ఇవన్నీ మచ్చుకు కొన్ని మాత్రమే...అయితే ముళ్ళపూడి రచనలు పుస్త్తకాల రూపంగా కాక చెదురుమదురుగా పత్రికలలో వచ్చినవి కూడా ఎక్కువే అని చెప్పవచ్చు. ఇవే కాక సినిమా కథలు, సంభాషణలు ఉండనే ఉన్నాయి. ముళ్ళపూడి సాహిత్యాన్ని విశాలంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారు 8 సంపుటాలుగా ప్రచురించారు. అవి
1. కథా రమణీయం -1 : సీతా కళ్యాణం, ఇద్దరమ్మాయిలూ ముగ్గురబ్బాయిలూ, జనతా ఎక్స్‌ప్రెస్, రాజకీయ బేతాళ పంచవింశతి, ఇతర కథలు
2. కథా రమణీయం - 2 : ఋణానంద లహరి, కానుక, రాధాగోపాలం, సాక్షి, ఆకలీ-ఆనందరావు, విమానం కథ, ఇతర కథలు
3. బాల రమణీయం : బుడుగు
4. కదంబ రమణీయం - 1 : నవ్వితే నవ్వండి, పీఠికలు, వ్యాసాలు, ఇతర రచనలు
5. కదంబ రమణీయం - 2 : గిరీశం లెక్చర్లు, కృష్ణ లీలలు, వ్యాసాలు, ఇతర రచనలు
6. సినీ రమణీయం - 1 : చలనచిత్ర ప్రముఖులపెై వ్యాసాలు, స్వదేశీ విదేశీ చిత్రాలపెై సమీక్షలు, విక్రమార్కుని మార్కు సింహాసనం కథలు
7. సినీ రమణీయం - 2 : కథానాయకుని కథ (అక్కినేని నాగేశ్వరరావు జీవిత చరిత్ర), చలనచిత్ర ప్రముఖులపెై వ్యాసాలు
8. అనువాద రమణీయం : 80 రోజుల్లో భూప్రదక్షిణ, పిటి 109
9. ప్రస్తుతం’ కోతికొమ్మచ్చి’ పేరుతో తన జీవిత చరిత్ర లాంటిది స్వాతి వార పత్రికలో వ్రాస్తున్నారు.
ఇంకా ఇవిగాక ఇద్దరు మిత్రులు (వెండితెర నవల), తిరుప్పావెై దివ్య ప్రబంధం మేలుపలుకుల మేలుకొలుపులు, రమణీయ భాగవత కథలు.
రామాయణం (ముళ్ళపూడి, బాపు), శ్రీకృష్ణ లీలలు.
అమ్మ మాట వినకపోతే...
1945లో బాల పత్రికలో రమణ మొదటి కథ అమ్మ మాట వినకపోతే అచ్చయ్యింది. అందులోనే బాల శతకం పద్యాలు కూడా అచ్చయ్యాయి. ఆ ఉత్సాహంతోనే ఉదయభాను అనే పత్రిక మొదలెట్టి తనే ఎడిటర్‌గా కీలక బాధ్యత వహించారు. మిత్రులతో కలిసి ఒక ప్రదర్శన నిర్వహించి, దానితో వచ్చిన డబ్బులతో ఒక సైక్లోస్టైల్ మెషిన్ కొన్నారు. ఆ పత్రికకు రమణగారే ఎడిటర్. చిత్రకారుడు మాత్రం బాపు. ఆర్ధిక ఇబ్బందుల వలన ఎస్సెల్సీతో చదువు ఆపిన రమణ చిన్నా చితకా ఉద్యోగాలు చేశారు. 1954లో ఆంధ్ర పత్రిక డెైలీలో సబ్ ఎడిటర్‌గా చేరారు. ఆంధ్రపత్రికలో పని చేసేటపుడే బుడుగు వ్రాశారు. దాదాపు ముళ్ళపూడి రచనలన్నీ బాపు బొమ్మల కొలువులు అని చెప్పవచ్చు.
బాపూ రమణీయం
బాపు అనగానే అందమైన బొమ్మలెలా గుర్తొస్తాయో, రమణ అనే పేరు కూడా జ్ఞప్తికి వస్తుంది. బాపు-రమణల స్నేహం అటువంటిది. బాపు బొమ్మల కొలువు పేర్చితే, ముళ్ళపూడి వెంకట రమణ ఆ బొమ్మల చేత అల్లరి చేయించి, మన ఇంట నవ్వుల పూవులు విరబూయించారు. బుడుగు గాడి అల్లరి, సీగాన పెసూనాంబ పాత్రలు పాఠకులు అంతలా దగ్గరయ్యారంటే రాసిన రమణదా గీసిన బాపుదా అంటే చెప్పడం చాలా కష్టం. ఈ మిత్రద్వయం తమ ప్రతిభతో తెలుగు చలనచిత్ర సీమకు ఆణిముత్యాలంటి చిత్రాలను అందించారు.
బాపు తెలుగు, హిందీ భాషల్లో 40 పెైగా చిత్రాలను రూపొందించారు. వీటిలో సాక్షి, బంగారు పిచ్చిక, బుద్ధిమంతుడు, సంపూర్ణ రామాయణం, సీతా కళ్యాణం, రామాంజనేయ యుద్దం, మంత్రి గారి వియ్యంకు డు, జాకీ, శ్రీరాజేశ్వరి వి లాస్ కాఫీ క్లబ్, శుభోదయం, ముత్యాలముగ్గు నుంచి పెళ్ళి పుస్త్తకం, మిస్టర్ పెళ్ళం వరకూ బాపు సినిమా లు రమణతో విడదీయలేని బంధాన్ని ఏర్పరుచుకున్నా యి. అందమైన తెలుగు వాకిళ్ళు, ఉయ్యాల బల్లలు, మెలిక ముగ్గులు. ఇలా ప్రతీ సన్ని వేశంలో తెలుగుద నం ఉట్టిపడుతుం ది. బాపు ఊహల కు రమణ తన సంభాషణా చాతు ర్యంతో ప్రాణం పోసేవారు. సీతా కళ్యాణం చిత్రంలో రామునికి ఒక్క సంభాషణ కూడా ఉండక పోవటం గమనార్హం. అలాగే, చారెడు-పిడికెడు-బారెడు అంటూ పెళ్ళిపుస్తకంలో దివ్యవాణి అందాన్ని, రాజేంద్ర ప్రసాద్ చేత తమాషాగా చెప్పించి, ఆ మాటల అర్ధాన్ని, ఒక పాటలో చెంపకు కన్నులు చారెడు-సన్నని నడుము పిడికెడు-దువ్వీ దువ్వక పువ్వులు ముడిచిన నల్లని నీ జడ బారెడు... అంటూ పూరించారు.
ఇంకా, అపార్ధసారధమ్మా(పెళ్ళి పుస్తకం), మంగళాస్త్రాలు(మంగళసూత్రమన్నమాట...సుందరకాండ సినిమాలో) వంటి పదప్రయోగాలు నవ్విస్తాయి. బాపు చిత్రాలలో చెప్పుకోదగిన ప్రయోగాలు...ఎప్పుడు చూసినా ఇద్దరు నాయికలతో అడిపాడే శోభన్‌బాబు చేత, ఏక పత్నీవ్రతుడెైన రాముని పాత్ర వేయించటం(సంపూర్ణ రామయణం).అలాగే, వాణిశ్రీతో మేకప్ లేకుండా నటింప చేయ టం(గోరంత దీపం). సినిమాలే కాక, బాపు-రమణలు టి.వి సీరియళ్ళు కూడా చేశారు. ‘భాగవతం’ అందులో చాలా ప్రసిద్ధి చెందింది.
ప్రముఖ రచయితగా...
ముళ్ళపూడి వెంకటరమణ ప్రముఖ తెలుగు రచయిత. తెలుగు నవలలు, కథలు, సినిమా కథలు, హాస్య కథలు అనేకం రాశారు. ముఖ్యంగా తన హాస్యరచనల ద్వారా సుప్రసిద్ధులయ్యారు. ఈయన వ్రాసిన పిల్లల పుస్తకం బుడుగు తెలుగు సాహిత్యంలో ముఖ్యంగా బాలసాహిత్యంలో ఒక విశిష్టమైన స్థానం సంపాదించింది. ప్రఖ్యాత చిత్రకారుడెైన బాపు ఈయన కృషిలో సహచరుడెైనందున వీరి జంటను బాపు-రమణ జంటగా పేర్కొంటారు. బాపు మొట్టమొదటి సినిమా సాక్షి , బంగారు పిచ్చుక, ముత్యాల ముగ్గు, గోరంత దీపం, మనవూరి పాండవులు, రాజాధిరాజు, పెళ్ళిపుస్తకం, మిష్టర్ పెళ్ళాం, రాధాగోపాలం వంటి మచ్చుక సినిమాలకు రచయితగా ముళ్లపూడివారు వ్యవహరించారు. 1995లో శ్రీ రాజాలక్ష్మీ ఫౌండేషన్ నుండి రాజాలక్ష్మీ సాహిత్య పురస్కారం అందుకున్నారు.
ముళ్ళపూడి ’చిత్ర‘ మణి మకుటాలు
- సాక్షి
- బంగారు పిచ్చుక
- ముత్యాల ముగ్గు
- గోరంత దీపం
- మనవూరి పాండవులు
- రాజాధిరాజు
- పెళ్ళి పుస్తకం
- మిష్టర్ పెళ్ళాం
- రాధాగోపాలం
- బుద్ధిమంతుడు,
- సంపూర్ణ రామాయణం,
- సీతా కళ్యాణం
- నండూరి రవిశంకర్
మాటల మాంత్రికుడు మరికలేడు !

స్వచ్ఛమైన స్నేహానికి బాపు-రమణలను ప్రతీకలుగా చెబుతారనే విషయం తెలిసిందే. బాలకృష్ణ-నయనతార జంటగా బాపు దర్శకత్వంలో రూపొందుతున్న ‘శ్రీరామరాజ్యం’ ముళ్లపూడి చివరి చిత్రం కానుంది. బాపు దర్శకత్వంలో రూపొందిన ‘ముత్యాలముగ్గు’ చిత్రంలో ముళ్లపూడి రాసిన డెైలాగులు ఎంత పాపులరో చెప్పాల్సినవసరం లేదు. ‘అందాలరాముడు’, ‘సాక్షి’, ‘సంపూర్ణరామాయణం’, ‘పెళ్లి పుస్తకం’, ‘మిస్టర్ పెళ్లాం’ వంటి చిత్రాలన్నిటికీ సంభాషణలం దించింది ముళ్లపూడి కలమే.
ఎన్టీఆర్‌తో ‘నా అల్లుడు’, రాజీవ్ కనకాలతో ‘విశాఖ ఎక్స్‌ప్రెస్’ చిత్రాలకు దర్శకత్వం వహించిన ముళ్లపూడి వర.. ముళ్లపూడి వెంకటరమణ తనయుడే.
ముళ్లపూడి మృతి పట్ల తెలుగు చలనచిత్రపరిశ్రమ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఒక గొప్ప రచయితను కోల్పోయామని పేర్కొంది.
No comments:
Post a Comment